Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
అర్జునుడి కన్నా విలుకాడు ఏకలవ్యుడు అని యర్రవరం గ్రామ సర్పంచ్ వేరేపల్లి సుబ్బారావు, పీఏసీఎస్ చైర్మన్ నలజాల శ్రీనివా సరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఎర్రవరం గ్రామ ముఖద్వారంలో ఏర్పాటు చేసిన ఏకలవ్యుడి విగ్రహాన్ని వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఏకల వ్యుని చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో కోలాట బృం దంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విగ్రహ దాత సర్పంచ్ వెంకట సుబ్బారావుని, మండపం దాత నలజల శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థల దాతలు వేమూరి సాంబయ్య, నరసింహారావు, గ్రామస్తులు వేమూరి వరదారావు, బూర శ్రీను, కో ఆప్షన్ సభ్యులు ఉద్దండు వార్డెన్ రాధాకృష్ణ,, బెల్లంకొండ నాగయ్య, వేమూరి మధు, సుల్తాన్, వీరబాబు, ధన మూర్తి, రాములు, నాగేశ్వ రరావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.