Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
యావత్ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ పేర్కొన్నారు. దేవరకొండ పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవరకొండ పట్టణంలోని 17వ వార్డు, 4వ వార్డు, 15వ వార్డులలో కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, రైతుబీమా, షాదీ ముబారక్, ఇతర మహిళా సంక్షేమ కార్య క్రమాల లబ్ధిదారుల ఇంటివద్ద వెళ్లి కలిసి అనంతరం వారితో సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ రహత్ అలీ, కౌన్సిలర్లు మహమ్మద్ రైస్, చిత్రం శ్రీవాని ప్రదీప్, మూడావత్ జయప్రకాష్ నారాయణ, వేముల రాజు, బొడ్డుపల్లి కష్ణ, జానిబాబా, జెల్ల అంజి, ప్రసాద్, చిత్రం ఏసోబు తదితరులు పాల్గొన్నారు.
పెద్దవూర : మండల పరిధిలోని నాయినవాని కుంట తండాలో సోమవారం అంతర్జాతీయ మ హిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మహి ళలకు అంగనివాడీ టీచర్ నారాయణమ్మ ముగ్గుల పోటీలు నిర్వహించారు.అనంతరం అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రమావత్ జానీ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, జాహిద, ఆయా శౌరి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
కరపత్రాల ద్వారా సంక్షేమ పథకాలపై అవగాహన
మహిళా దినోత్సవంలో భాగంగా సోమవారం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను మహిళలకు విన్నవించారు. కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గుంటుక వెంకట్ రెడ్డి, అధ్యక్షులు జటావత్ రవినాయక్, చింతపల్లి సర్పంచ్ గౌరవ సలహాదారు సంజీవ రెడ్డి, తుంగతుర్తి ఎంపీటీసీ గౌరవ సలహాదారు కృష్ణ, శ్రీకర్, శివాజీ, శంకర్, శ్రీనివాసాచారి, భాష, బాలు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.