Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా అధ్యక్షుడు బొజ్జ చిన వెంకులు
నవతెలంగాణ-శాలిగౌరారం
ఫీల్డ్ అసిస్టెంట్లను పర్మినెంట్ చేయాలని వ్యవసా య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ చిన వెంకులు డిమాండ్ చేశారు. పలు సమస్యలపై వ్యకాస ఆధ్వర్యంలో మండలంలో సర్వే నిర్వహించారు. ఈ సం దర్భంగా గురిజాల గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లను పర్మినెంట్ చేయకపోవడం వల్ల జిల్లాలో సుమారు 15 వేల మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వ్యకాస మండల నాయకులు మక్క బుచ్చిరాములు, డెంక లింగయ్య, చలకాని మల్లయ్య, కిరణ్ కుమార్, కూర్చుండి మావయ్య, మా రోజు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.