Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ పర్యవరణ వేత్త్త మోథాపాట్కర్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రపంచ స్థాయిలో మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఆర్థిక అసమానతలతో పాటు అనేక అంశాలలో స్త్రీలు వంచించపడుతున్నారని ప్రముఖ పర్యావరణ వేత్త మేథాపాట్కర్ అన్నారు. ప్రజాసైన్స్ వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజాసైన్స్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు డా.ఎం. సురేష్ బాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన గూగుల్ మీట్ సమావేశంలో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేథాపాట్కార్ మాట్లాడుతూ స్త్రీలు ప్రపంచ స్థాయిలో అనేక రంగాల్లో ఎన్నో ఘనతలు సాధించినప్పటికీ ఆర్థిక అసమానతలు, పౌష్టికాహారంలోనూ, స్త్రీ పురుష, అసమానతలను ఇప్పటికీ ఎదుర్కొంటున్నారని అన్నారు. స్త్రీలపై జరిగే అత్యాచారాలకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగికంగా, గృహ హింస పరంగా వేధించే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని, స్వచ్ఛంద సంస్థలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత, ప్రజాసైన్స్ వేదిక జాతీయ నాయకులు డా. మువ్వా రామారావు, ప్రజాసైన్స్ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్, పశ్య పద్మ, ఫరీదా, సమత, కన్వినర్ విజయలక్ష్మి, లెనిన్, శరత్ బాబు, కస్తూరి ప్రభాకర్, కొడారి వెంకటేష్ పాల్గొన్నారు.