Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని టీడీపీ మండలకమిటీ ఆధ్వర్యంలో డిమాండ్‌చేస్తూ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సూరజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జక్కలి అయిలయ్యయాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో 8 సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా, నోటిఫికేషన్లు వేయకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వివిధ శాఖల్లో రెండు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. భవిష్యత్తుపై భరోసా లేక మనో వేదనతో నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. నిరుద్యోగ భతి వెంటనే అమలుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎమ్‌డి.హన్నూబాయి, నాయకులు గంగాపురం గంగాధర్, కుక్కల నర్సింహా, తొర్పునూరి బాబుగౌడ్, సుంకరి జంగయ్య, గంగాపురం దశరథ, చిలివేరు నర్సింహా, బొంగు బాదుషా, చెరుకు అశోక్ పాల్గొన్నారు.