Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట భూ నిర్వాసితుల ధర్నా
నవతెలంగాణ-నల్లగొండ
పల్లె ప్రకృతివనం పేరుతో ప్రభుత్వం లాక్కున్న పట్టా భూములను తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కనగల్ మండలం ఎడపెల్లి గ్రామానికి చెందిన రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీపీఎం, బీజేపీ, టీజేఎస్ నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కనగల్ మండలం జి యడవల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం కోసం 43 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వం జప్తు చేసిందని పేర్కొన్నారు. జప్తు చేసిన భూమి తాతల కాలం నాటి నుండి వచ్చిందని, కొందరు ఆ భూములను కొనుగోలు చేయగా వారికి రైతు బంధు కూడా వస్తుందన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేసినా న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకున్న భూమిని రైతులకు అందజేయలని, లేని యెడల ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పాలడుగు నాగార్జున, పాలడుగు పద్మావతి, దండెంపల్లి సత్తయ్య, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, నాయకులు వీరునాయక్ , భూ నిర్వాసితులు, రైతులు పాల్గొన్నారు.