Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
హరితహారం కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ బడ్జెట్ను పూర్తిగా ఖర్చు చేయాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభించుటకు ముందు 25వ వార్డు కౌన్సిలర్ చింతల మణి మరణించినందున మౌనం పాటించినారు. సమావేశములో బడ్జెట్ 2022-23ఆ ర్థిక సంవత్సరానికి ఆదాయము రూ.36.64 కోట్లు, వ్యయము రూ.36.64 కోట్లుగా పేర్కొన్నారు. 2021-22 ఆర్థ్ధిక సంవత్సరంకు సవరించిన బడ్జెట్ అంచనాలు ఆదాయము రూ.37.77 కోట్లు, వ్యయం రూ.37.77 కోట్లు అమోదిస్తూ తీర్మానించారు. దీనిలో గ్రీన్ బడ్జెట్ కింద రూ.1.75 కోట్లు ఉన్నాయి. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు (రోడ్లు, మురికి కాలువలు, కాజ్ వేలు ఇతర ప్రజా సౌకర్యాల కొరకు రూ.4.25 కోట్లు, పారిశుద్ధ్య కొరకు రూ.2.13 కోట్లు, విద్యుత్ చార్జీల చెల్లింపుల కొరకు రూ.1.60 కోట్లు, సిబ్బంది జీతభత్యముల కొరకు రూ.5.80 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు పలు సమస్యలపై చర్చించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్, మహిళా వార్డు కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. సమావేశములో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యాలయ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.