Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14,15,16,17 తేదీల్లో భౌతిక వేలం ద్వారా విక్రయం
- పనులను త్వరితగతిన పూర్తిచేయాలి
- కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడ గ్రామ పంచాయతీ నార్కట్ పల్లి-అద్దంకి హైవే పక్కన మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎదురుగా ప్రభుత్వం ద్వారా రాజీవ్ స్వగహ శ్రీ వల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్ల వేలం పై నిర్వహించిన మూడో ప్రీ బిడ్ సమావేశానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి బిడ్డర్లు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి చిక్కులు లేని ప్లాట్లను మార్చి 14,15,16,17 తేదీల్లో నిర్వహించే భౌతిక వేలంలో పాల్గొని సొంతం చేసుకోవచ్చని అన్నారు. చదరపు గజానికి రూ.7 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. వేలంలో పాల్గొనాలని ఆసక్తి ఉన్న వారు రూ.10 వేల దరావత్తు సొమ్ము ( ఈఎండీ)గా జిల్లా కలెక్టర్, నల్గొండ పేరుపై తీసిన డీడీని జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్ చాంబర్ వద్ద ఏర్పాటు చేసిన రాజీవ్ స్వగృహ కౌంటర్లో కానీ, నార్కట్ పల్లి మండలం, ఎల్లారెడ్డి గూడ వద్ద రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్లో ఏర్పాటు చేసిన రాజీవ్ స్వగృహ కార్యాలయంలో అందచేయవచ్చని అన్నారు. డీడీ అందచేసిన వారికి రసీదు, టోకెన్ నంబర్ ఇవ్వడం జరుగుతుందని, దరఖాస్తు లో అన్ని వివరాలు పూరించి అంద చేయాలని తెలిపారు. రూ.10 వేలు డీడీ చెల్లించిన వారు కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో మార్చి 14,15,16,17 తేదీలలో 267 చ.గ. ల నుండి 150 చ.గ. ల వరకు వివిధ విస్తీర్ణంలలో ఉన్న 240 ప్లాట్లకు పారదర్శకంగా నిర్వహించనున్న భౌతిక వేలంలో పాల్గొని ప్లాట్లను సొంతం చేసుకోవచ్చని అన్నారు. ఆసక్తి గల వారు కింది సైట్ను సందర్శించి పరిశీలించుకోవచ్చని తెలిపారు. https://nalgonda. telangana.gov.in http;//auctions.hmda. gov.in, http;//swagruha. telangana.gov.in http;//tsiic.gov.in. మరిన్ని వివరాలకు 9849903267 నంబర్లో సంప్రదించాలని కోరారు. సైట్ కార్యాలయం ఫోన్ నంబర్ 9154339209, సయ్యద్ షఫీయుద్దీన్, లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్ 18004251442కు ఫోన్ చేసి తెలుసు కోవచ్చని అన్నారు. సమావేశానికి హాజరైన వారు అడిగిన సందేహాలను జిల్లా కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, రాజీవ్ స్వగృహ డైరెక్టర్ సి.భాస్కర్ రెడ్డి, హెచ్ఎండీఏ ఈఈ రమేష్, తహశీల్దార్ భిక్షపతి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీఎం శ్రీనివాస్ హాజరయ్యారు.
పనులను త్వరితగతిన పూర్తిచేయాలి
పట్టణంలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. సోమవారం పట్టణంలోని దేవరకొండ రోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ, అండర్ గ్రౌండ్ డెయ్రినేజీ, పుట్ పాత్ పనులను, పాలిటెక్నిక్ కాలేజీ వద్ద జరుగుతున్న తారు రోడ్డు పనులను, నాగార్జున డిగ్రీ కాలేజీ నుండి గడియారం సెంటర్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ , టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.