Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో న్యాయవాది సంతోష్ నాయక్ పై జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం హుజూర్నగర్ పట్టణంలోని కోర్టులో పనిచేస్తున్న న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాదులు మాట్లాడుతూ దుండగులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని సంతోష్ కుమార్ పై దాడి చేయటం సహించరాని విషయం అన్నారు. ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు కాలువ శ్రీనివాసరావు, సీహెచ్. యాదగిరి, నరసింహారావు, ప్రవీణ్, జక్కుల వీరయ్య, అంజయ్య, సురేష్ నాయక్, శంకర్ నాయక్, వెంకటేష్, బాలాజీ పాల్గొన్నారు.