Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
రాబోవు 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి. భిక్షపతి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని బ్రాహ్మణ వెల్లంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న రీడ్ ప్రోగ్రాంను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భోజన నిర్వాహకులకు మెనూ పాటిస్తూ నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఓరుగంటి శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాజవర్ధన్‌రెడ్డి, విజరు పాల్ పాల్గొన్నారు.