Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని మును గోడు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్.మురళీ మోహన్ అన్నారు. మంగళవారం అంతర్జాతీ య మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ అధికారులకు సిబ్బందికి ఘనంగా సన్మానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు నిర్వహించే రంగాలు సమర్థవంతంగా పారదర్శకతలో ఉంటాయన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సీనియర్ అసిస్టెంట్ కె.కల్పన, దత్తాత్రేయ, శ్యామల, పెద్దమ్మ, సంపూర్ణ, పావని ఉన్నారు.