Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతలపాలెం :మండలంలోని గుడిమల్కాపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఎంపీడీఓ గ్యామానాయక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూలీలకు పలు సూచనలు చేశారు.అనంతరం మాట్లాడుతూ పంటకాలువ పూడిక తీయుట పనులను వారు తనిఖీ చేసి కొలతల ప్రకారం ఒక వ్యక్తి రూ.245 పొందేందుకు ఎనిమిది మీటర్ల పొడవు, మీటర్ల వెడల్పు అరడుగు లోతు ప్రస్తుతం ఉన్న కాలవలో పూడిక తీయాలని పనిచేయాలని సూచించారు.కోవిడ్ నిబంధనల ప్రకారం మాస్కూ ధరిస్తూ, సామాజికదూరం పాటించాలని సూచించారు.సోషల్ ఆడిట్ వారు తనిఖీ నాటికి కూడా కనబడేలా నాణ్యతతో కొలతల ప్రకారం పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఏ రవి, కార్యదర్శి మహేష్, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.