Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
వరిలో తెల్లకంకుల నివారణకు ఎఫ్ఎంసీ ఉమ్మడినల్లగొండ రీజినల్ మేనేజరు సుధాకర్ రైతులకు అవగాహన కల్పించారు.మండలపరిధిలోని అనంతారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.వరిపొట్టదశలో ఎఫ్ఎంసీ కోరాజన్ ఎకరానికి 60శాతం పిచికారీ చేసుకోవడం ద్వారా తెల్ల కంకులు లేదా ఉస తిరుగుడు రాకుండా నివారించి మంచి దిగుబడులు పొందవచ్చన్నారు. కోరాజన్ వాడే వరిలో మోగిపురుగు, ఆకుచుట్టు పురుగులను నివరించడంతో పాటు పొట్టకు చివరి వరకు ఆరోగ్యంగా ఆకుపచ్చగా ఉండేటట్టు చేయడం ద్వారా కంకి పూర్తిగా నిండి అధికదిగుబడులకు పునాది వేస్తుందన్నారు. ఎఫ్ఎంసీ లెజెండ్ వరిలో ఎకరానికి 48 గ్రాములు పిచికారీ చేసుకోవడం వలన అధికదిగుబడి పొందాడానికి ఉపయోగ పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట మార్కెటింగ్ ఏసీ చంద్రశేఖర్, ఎంఐసీి అశోక్, ఎండి ఓఎస్ మని, నాగరాజు, శ్రీనివాస్, కష్ణ, డిస్టబ్యూటర్ నాగరాజు, డీలర్లు బైరెడ్డికోటిరెడ్డి, కోడిదలశ్రీనివాస్, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.