Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ ఎల్.రమణ
నవతెలంగాణ-చౌటుప్పల్
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్సీ ఎల్.రమణ తెలిపారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పద్మావతి ఫంక్షన్హాల్లో చేనేతపై జీఎస్టీని రద్దుచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చేనేత కార్మికులు ఏర్పాటుచేసిన పోస్టుకార్డు ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. యార్న్ పై 40శాతం సబ్సిడీని సకాలంలో చెల్లించాలని, చేనేతకు చేయూత పథకంలో అర్హులైన వారికి వర్తింపచేయాలని, నిరుపేద చేనేత కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరుచేయించాలని ఎమ్మెల్సీ రమణకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు చేనేత సహకారసంఘంలో రమణతోపాటు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందగట్ల బిక్షపతి, గర్దాసు బాలయ్య, బడుగు మాణిక్యం, ఎర్రమీద వెంకన్న, పిల్లలమర్రి శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, విద్యాసాగర్, తాటి రామచంద్రం, తిరందాసు ధనుంజయ, చక్రపాణి పాల్గొన్నారు.