Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరుణోదయ సంస్కత సమితి అధ్యక్షురాలు విమలక్క
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
స్త్రీలు పురుష అసమానతలు లేని సమాజం రావాలి అరుణోదయ సంస్కత సమితి అధ్యక్షురాలు విమలక్క అన్నారు. మంగళవారం పురపాలక కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ పౌండేషన్ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పౌండేషన్ అధ్యక్షుడు బడుగు దానయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో స్త్రీలు పాల్గొని వీర మరణం పొందారన్నారు. మహిళలు వివిధ రంగాల్లో సేవలు సమాజానికి ఎంతగానో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన ఐదుగురు మహిళలకు మెమొంటో శాలువాతో సత్కరించారు. అంగన్వాడి వైద్య ఆరోగ్య స్వయం సహాయక సంఘాలు పనిచేసిన 50 మంది సిబ్బంది మహిళలకు శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలిండియా పద్మశాలి సహకార సంఘం మహిళా అధ్యక్షురాలు వనం దుశ్శల రాష్ట్ర పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షులు గుంతకల్ రూప జెడ్పిటిసి కోట పుష్పలత చేనేత సహకార సంఘం అధ్యక్షులు మెరుగు శశికళ కర్నాటి అంజమ్మ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రాపూర్ గ్యానేశ్వర్ కార్యదర్శి కష్ణ కుమార్ వెంకటేశం కోశాధికారి పాండు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గర్ల్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం జైన ధర్మశాల ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి. మాధవి వెంకటేష్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ అభిషేక్ ,డాక్టర్ తబిత ,డా''అనిరుస్ ప్రాజెక్ట్ ఆర్గనైజర్ పాల్ ,సూదగని సాగర్ అరుణ,శ్రావణ్, రాజు, మల్లేష్,పాస్టర్ ఏలీయా తదితరులు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి :తెలంగాణ సాంఘిక సంకైమ గురుకుల పాఠశాల ఎస్సీ బాలుర చెరువుగట్టు నందు మంగళవారం అంతార్మాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నల్లగొండ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ హెచ్-అరుణ కుమారి పాల్గొని మాట్లాడుతూ ప్రతి స్త్రీ అమ్మతో సమానమని, ప్రతి ఒక్క స్త్రీలను గౌరవించాలని, స్త్రీలు చిన్న పిల్లలపై జరుగుతున్నదాడులను ఖండించాలని విద్యార్థులకు సూచించారు . ఆ తరువాతపాఠశాల మహిళా ఉపాధ్యాయినులను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రిన్సిపాల్ ఎ.అశోక్ బాబు కట్టంగూరు ప్రిన్సిపాల్ రమ, డా? సజన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.