Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు చీరిక అలివేలు విమర్శించారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఐద్వా, సీఐటీయూ, వ్యవసాయ కార్మికసంఘం, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక ప్రభుత్వాలు మారినా మహిళలకు సమాన పనికి సమాన వేతనం కల్పించడం లేదన్నారు. కనీస వేతనం అమలుచేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి ఎమ్‌డి.పాషా, ఎమ్‌డి.అర్షియాబేగం, బత్తుల జయమ్మ, దొడ్ల ఆండాలు, రేష్మబేగం, రొడ్డ అంజయ్య, గంగదేవి సైదులు, బండారు నర్సింహా, వీరమల్ల యాదమ్మ, మామిడి స్వరూప, అంతటి ఉమ, బోయ మానస, రొడ్డ సోని, విజయ, ఎమ్‌డి.ఖయ్యుమ్, దేప రాజు, బోయ యాదయ్య, దేవయ్య, చీరిక సంజీవరెడ్డి, బత్తుల దాసు, కొండె శ్రీశైలం పాల్గొన్నారు.