Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చదువు, కెరీర్ పై శ్రద్ద పెట్టండి
- జిల్లా ఉపాధి కల్పన అధికారి పి. సాహితి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
సంపూర్ణ స్వావలంబన ధ్యేయంగా ముందుకు సాగాలని, అనుకున్న రంగాలలో అగ్రభాగాన నిలిచినప్పుడే మహిళా సాధికారత సాధ్యమని జిల్లా ఉపాధి కల్పన అధికారి పి. సాహితి పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కించుకుని కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రత్వ శాఖ పరిధిలోని ఫీల్డ్ ఔట్రీచ్ బ్యూరో మంగళవారం భువనగిరి పట్టణం లోని స్టాన్ ఫోర్డ్ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రత్యేక సదస్సు నిర్వహించింది. జిల్లా క్షేత్ర ప్రచార అధికారి జి. కోటేశ్వర్ రావు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో సాహితి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలని, అప్పుడే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అన్నారు. విద్యార్థినులు చదువు, కెరీర్ మీద దష్టి పెట్టాలని కోరారు. సామాజిక మాధ్యమాల పట్ల జాగ్రత్త గా ఉండాలని సూచించారు. స్టాన్ఫోర్డ్ మహిళా కళాశాల విద్యార్థినులకు మహిళా సాధికారత అనే అంశంపై వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల విజేతలకు సదస్సులో ముఖ్య అతిథులు మెరిట్ సర్టిఫికేట్, ప్రైజ్ అందచేసి అభినందించారు. తల్లులకు కలశాల ఆవరణలో మురుగన్ ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్యులు తల్లులకు, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందచేశారు. కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ సౌజన్య, డాక్టర్ కావ్య, తదితరులు పాల్గొన్నారు.