Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ -నల్లగొండ
దేశంలో యువశక్తికి కి కొదవ లేదని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువజన సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానిక ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భారతదేశంలో యువశక్తికి కొదవలేదని, సరైన విద్యను, నైపుణ్యాలను నేర్చుకొని, క్రమశిక్షణతో విజయం వైపుకు అడుగులు వేయాలని కళాశాల విద్యార్థులకు పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. వేణు మాట్లాడుతూ యువతలో నేరప్రవత్తి పెరగడం బాధాకరమన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, ప్రొఫెసర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి మాట్లాడుతూ స్వామి వివేకానంద, మహాత్మ జ్యోతిబాపూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి మహానుభావులను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుట లో మంచి పోషకాహారం, పరిశుభ్రత, వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ శ్రీ %ఙ%. వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి, ఆల్కహాల్ వంటి దురలవాట్లకు లోనై జీవితాన్ని నిరాశా నిస్పహలతో గడుపుతున్నారన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ రమావత్ దసురు నాయక్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ దశ చాలా కీలకమైనదని, జీవితాన్ని మంచి వైపుకు మలుపు తిప్పే ఏ అవకాశాన్ని వదులుకోవద్దన్నారు. ప్రముఖ పర్యావరణ వేత్త శ్రీ సురేష్ గుప్తా వ,వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ పి లక్ష్మణ్ మాట్లాడారు. నెహ్రూ యువ కేంద్రం, నల్గొండ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ బి ప్రవీణ్ సింగ్ నిర్వహణలో, రమేష్ , యూత్ వాలంటీర్లు, సాయి కుమార్, అజరు, దేవేందర్, హేమలత, కొండ నాయక్ ఆధ్వర్యంలో సమ్మేళనం నిర్వహించారు. అనంతరం మహిళా అధ్యాపకులను సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె. నరేంద్ర కుమార్ సభాధ్యక్షత వహించగా, వత్తి విద్యా కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి, రెండు కళాశాలల అధ్యాపకులు అయిన ఎండి ఇస్మాయిల్, సింగం శ్రీనివాస్, జి వెంకటేశ్వర్లు, అజరు, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, ఎం శ్రీనివాస్, మంగ్యా నాయక్, రామకష్ణ, లక్ష్మి, కొండల్, డాక్టర్ ఎస్ ఆర్ కె అ న్సారీ, శ్యామ్, రవికుమార్, క్రాంతి, శ్వేత, కళావతి, జ్యోతి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.