Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
మహిళా పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి అని 23 వ వార్డు కౌన్సిలర్ వల్దాసు సౌమ్య జానీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యపేట జిల్లా కమిటీి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా పారిశుధ్య కార్మికులకు సన్మానం నిర్వహించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు గౌడ్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి , ఆరోగ్యాలను కాపాడి సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతు న్నారన్నారు. దేశ సైనికుల తరువాత దేశానికి ఎక్కువ సేవ చేసేది పారిశుధ్య కార్మికులే అన్నారు. అట్లాంటి పారిశుధ్య కార్మికులను సన్మానించడం చాల గర్వంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాల్వాయి జానయ్య, స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు నాయిని శ్రీనివాస రావు,బుక్క రాంబాబు,నాయకులు మండల్ రెడ్డి వెంకటరెడ్డి,గట్టు అశోక్, లింగాల సాయి, బూర వెంకటేశ్వర్లు,ఎరుకల సైదులు,బుక్క ఉపేందర్, నందిపాటి సైదులు,ప్రభాకర్ పాల్గొన్నారు.