Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మిర్యాలగూడ
15 ఏళ్లుగా శ్మశాన వాటికలో కాటి కాపరి గా పనిచేస్తున్న మహిళ పత్తిపాటి మనెమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్ ఘనంగా సన్మానించారు. పూలదండలతో సత్కరించి కొత్త చీరను బహుకరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 ఏళగా ఇద్దరు పిల్లలతో శ్మశాన వాటికలో కాటికాపరిగా పని చేస్తూ జీవనం సాగిస్తుందని ఆమెకు ఎన్నో ధైర్యసాహసాలు ఉన్నాయని పేర్కొన్నారు. దాన సంస్కారాలు పూర్తయ్యాక కుటుంబ సభ్యులు అందించే ఆర్థిక సహాయంతో తమ కుటుంబాన్ని పోషించుకుంటూ అలాంటి మహిళకు చేయూత ఇవ్వాల్సిన అవసరం మనందరి పై ఉందన్నారు. మునెమ్మ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉదయ భాస్కర్, మలగం రమేష్,ఎండి సలీం టీిఆర్ఎస్ నాయకులు సత్యం ఎండి ఖాదర్, మన్నెం లింగా రెడ్డి, పత్తి పాటి నవాబ్, బంటు శ్రీనివాస్, మధుసూదన్ పాల్గొన్నారు.