Authorization
Sat March 22, 2025 04:24:31 am
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని చందుపట్ల ఆమ్లెట్ కుమ్మరిగూడెం గ్రామంలో ఉపాధి హామీ నిధుల నుండి 5 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనులకు మంగళవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి మండ లాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాల న్నారు.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పిటిసి బీరు మల్లయ్య , భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మెన్ నలమాస రమేష్ , మండల అధ్యక్షులు జనగాం పాండు , పిఎసిఎస్ చందుపట్ల మాజీ చైర్మన్ బల్గురి మధుసూదన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చిన్నం పాండు , ఎంపీటీసీ బొక్క కొండల్ రెడ్డి , గ్రామ శాఖ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.
తాజ్పూర్ రోడ్డు పనుల పరిశీలన
మండలంలోని మండలంలోని అనంతారం మీదుగా తాజ్పూర్ బీటీ రోడ్డు పనులను మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మరం సురేష్, అనంతారం సర్పంచ్ మల్లికార్జున్, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ నలమాస రమేష్ గౌడ్, సింగిల్విండో చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ వెంకటేశం, టిఆర్ఎస్ నాయకులు మధుసూదన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి , మండల అధ్యక్షులు జనగాం పాండు, గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్ పాల్గొన్నారు.