Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట విపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి.పాలకవర్గం ఏకపక్ష నిర్ణయాలతో అవినీతికి పాల్పడు తున్నారని ఆరోపిస్తూ విపక్ష పార్టీల నేతలు , ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు కన్నెర్ర చేశారు.మంగళవారం నేరేడుచర్ల మున్సిపాలిటీ అవినీతిపై కాంగ్రెస్ , టీడీపీ , సీపీఐ(ఎం), సీపీఐఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కొణతం చినవెంకటరెడ్డి ధర్నానుద్దేశించి మాటా ్లడారు.మున్సిపాలిటీకి మంజూరైన పట్టణ ప్రగతి నిధుల నుండి రూ. 25 లక్షల పనులను నామినేషన్ పద్ధతిన ఇద్దరు కాంట్రాక్టర్లకు ఇచ్చారన్నారు.వాటిని రద్దు చేసి టెండర్లు పిలవాలని మున్సిపల్ కమిషనర్ ముందే చైర్మెన్ చాంబర్లో కౌన్సిలర్లు నిలదీస్తే నామినేషన్ పద్ధతిన ఎవరు పనులు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని, ఇందుకు గాను టీఆర్ఎస్ పట్టణ కమిటీకి రూ.4 లక్షలివ్వాలంటూ నాయ కులు అడగడం సిగ్గు చేటన్నారు.ఈ విషయాన్ని విలేకర్ల సమావేశంలో రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.అధికార పార్టీ డబ్బు దండుకోవడం కోసం మున్సిపల్ కౌన్సిల్ తీర్మాణం లేకుండా నామినే షన్ పద్ధతిని పనులు కట్టబెడు తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు ఐదేండ్లుమాత్రమే అధికారంలో ఉంటారని, అధికారులు 30 ఏండ్లు ఉంటా రన్నారు. అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదన్నారు. కమిషనర్‌ను ఏ పని గురించి అడిగినా పైనుండి ఒత్తిడి ఉందని..తాను ఏమీ చేయలేనంటూ దాటవేస్తు న్నారన్నారు. ప్రోటోకాల్ మరిచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపనలో కౌన్సిలర్లను అవమానపరిచారని ఆరోపించారు. మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి రెండు సార్లు బడ్జెట్ పెట్టారని, గత బడ్జెట్ నిధులు ఏమయ్యాయో జమ ఖర్చులు చూపాలని ప్రతి సమావేశంలో అడుగుతున్నా చూపించడం లేదన్నారు. ఇప్పటి నుంచి అవినీతిపై నిరవధిక పోరాటం చేస్తామని హెచ్చరించారు . 25 లక్షల నామినేషన్ పనులు పీఏసీఎస్చైర్మెన్గా ఉన్న అనంతు శ్రీనివాస్‌గౌడ్‌కు ఎలా కేటాయిస్తారని, అతను ఏవిధంగా కాంట్రాక్టులు చేస్తారని, ఇటీవల పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ఆరోపించారు. అతని కాంట్రాక్టు లైసెన్స్ రద్దు చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపి ంచారు.రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో అవినీతి జరగకుండా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.ధర్నాలో మాజీ ఎంపీపీ పారేపల్లి శేఖర్‌రావు,నాయకులు కొడమగుండ్లనగేష్ , పాల్వాయి రమేశ్, పాల్వాయి కష్ణమూర్తి, బచ్చలకూరి ప్రకాష్, రణపంగనాగయ్య, నూకల సందీప్‌రెడ్డి, తాళ్ల రామకష్ణారెడ్డి, రావుల సత్యం, చిలకరాజు శ్రీను ,వరలక్ష్మీ,రుద్రమ్మ, సురేష్‌రెడ్డి, మీనయ్య,పాండునాయక్, మరి నాగేశ్వరరావు, కుంకు తిరుపతయ్య, నీలా రామ్మూర్తి, ఎడ్ల సైదులు, ఖాదర్, మీనయ్య, ఇంజమూరి వెంకటయ్య, రాచకొండ అజరు, కత్తి శ్రీనివాసరెడ్డి , సింహాద్రి పాల్గొన్నారు.