Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ రాష్టం ఏర్పాటు అనంతరం సూర్యాపేట పట్టణం దినదినాభివృద్ధి చెందు తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.దీనికి అన్ని వర్గాల ప్రజలు,రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా సహకరిస్తేనే సహకరిస్తేనే పట్టణం సుందర వనంగా రూపుదిద్దుకొని భావితరాలకు చూడ చక్కని పట్టణంగా సంతరించుకుంటుందన్నారు. మంగళవారం పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగిన మాస్టర్ ప్లాన్ పునర్విభజన సమావేశంలో ఆయన మాట్లాడారు.గత పాల కులు, అధికారులు పేట మున్సిపాలిటీని పట్టించు కోక పోవడం వల్ల 1982 లో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ అమలులో నేటికీ ఉందన్నారు.1982 కంటే ముందు పట్టణంలో పాతరోడ్లు 40 ఫీట్లు ఉండేవని,అనంతరం రోడ్లును కుదించుకొను చిన్నసందు రోడ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిని ప్రజలు గుర్తించాలని కోరారు. పట్టణానికి ఔటర్‌రింగ్ రోడ్డు అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభసభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, పురపాలక పరిపాలన సంచాలకులు డాక్టర్. యన్.సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు.