Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండితుల పారాయణాలు
- ఉచిత వైద్య శిబిరం
- రాత్రి పొన్నవాహన సేవలో ఊరేగింపు
నవతెలంగాణ- యాదాద్రి
యాదాద్రి వార్షిక జాతరలో భాగంగా ఐదవ రోజు మంగళవారం యాదగిరి నృసింహుడు దశావతారాలలో భాగమైన శ్రీకృష్ణపరమాత్మ (మురళీకృష్ణుడు)గా భక్తులకు దర్శనమిచ్చారు. పిల్లన గ్రోవి..వజ్రవైఢూర్యాలు...స్వర్ణాభరణాలు...ముత్యాలహారాలు....పట్టుపీతాంబరాలతో మురళికృష్ణుడు భక్తజనకోటికి స్వామివారు కనువిందు చేసి రాత్రి పొన్నవాహనంపై విహరించాడు. ఋత్వికులు వేదమంత్రాలతో స్వామిని స్తుతిస్తుండగా, పండితుల పారాయణాలు, సన్నాయి మేళాలు మంగళవాయిద్యాలు నడుమ స్వామివారిని ఊరేగించారు.
రాత్రి పొన్నవాహనంపై చిన్నికృష్ణుడి సేవ....
లకీëనృరసింహుడు చిన్నికృష్ణుడి అవతారంలో రాత్రి పొన్న (వృక్షం) వాహనంపై బాలాలయంలో ఊరేగుతూ భక్తుజనులకు దర్శనమిచ్చారు. పొన్న చెట్టు నీడలో చిలిపి కృష్ణుడి రాసలీల వైభవాలు, వాహన సేవ ఆహ్లాదకరంగా చేపట్టారు. భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు.కొలిచేవారిని తనలో లీనం చేసుకునే పర్వాన్ని ఈ అలంకార సేవలో పొందుపరిచిన విశిష్టతను ఆలయ అర్చకులు తెలిపారు. యాగశాలలో ప్రత్యేకహోమాది పూజలు, ఋత్వికుల పారాయణాలు గావించారు. యాజ్ఞికులు తన బృందంతో పూజలు చేపట్టారు. హోమాది పూజలల్లో పాల్గొన్న ఋత్వికులు స్తోత్ర పఠనం నిర్వహించారు. నిరంతరం పారాయణ పఠనంతో క్షేత్ర ప్రాధాన్యత, బ్రహ్మోత్సవ వైభవం సంతరించుకుంటాయన్నారు. ఈ వేడుకల్లో అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, ఆలయ ఇన్చార్జీ ఈవో ఎన్ గీత, ఏఈవోలు దోర్భల భాస్కరశర్మ, గట్టు శ్రావణ్ కుమార్, గజివెల్లి రమేష్‌బాబు, దూశెట్టి క్రిష్ణ, వేముల రామ్మోహన్, టెంపుల్ పర్యవేక్షకులు రాకేష్‌రెడ్డి, సత్యనారాయణశర్మ, ఇతర శాఖల పర్యవేక్షకులు వాసం వెంకటేశ్, దాసోజు నరేష్, రాయగిరి విజరుకుమార్, అశోక్, మాచర్ల రాజన్‌బాబు, వేముల వెంకటేశ్, డి సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరం....
జాతరలో భాగంగా డాక్టర్ వై కల్యాణ్ (ఎండి), డాక్టర్ రాణీచౌదరి (ఎంబీబీఎస్) (డీజీవో) ఉచిత వైద్య శిబిరంలో జనరల్, స్త్రీ సంబంధిత వైద్యం అందజేశారు. కొండకింద నృరసింహ సదనంలో జరిగిన ఈ క్యాంపులో సుమారు 200 మంది వైద్య సేవలు పొందారు.
జాతరలో నేడు...
జాతరలో భాగంగా బుధవారం గోవర్థనగిరిధారి అలంకారం సేవ బాలాలయంలో ఊరేగిస్తారు. రాత్రి సింహవాహన సేవపై ఊరేగుతారు.