Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వని ప్రభుత్వం
- విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి
- పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వని ప్రభుత్వం
- విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజలకు భ్రమ కల్పించే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆచరణలో అమలు కాని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలని విమర్శించారు. గతంలో కేటాయించిన నిధులు ఖర్చు చేయలేదని, మరోమారు అంకెల గారడీతో ప్రజలను భ్రమలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ భృతి విషయాలపై స్పష్టమైన ప్రకటన చేయలేదని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల పెరిగినా వృద్ధాప్య పెన్షన్లు కొత్తవి ఇవ్వడాన్ని పేర్కొనలేదని చెప్పారు. అలాగే ఇరిగేషన్ శాఖ కి రూ.26 వేల కోట్లు కేటాయిస్తే నల్గొండ జిల్లా నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం, నక్కలగండి ఎత్తిపోతల పథకానికి, సాగర్ ఆధునీకరణకు, ఉదయ సముద్రం ఎత్తిపోతల పూర్తి చేయడానికి బడ్జెట్ కేటాయింపులో జరుగుతున్న అలసత్వాన్ని ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసిందని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించడం లేదని చెప్పారు. ఈ రకంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే ఎప్పటి వరకు పూర్తవుతాయని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు కూడా అరకొర మాత్రమే ఉన్నాయన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు తగిన నిధులు కేటాయించడం, ఇంటి స్థలం సొంతంగా ఉన్నవారికి నిర్మాణం చేసుకుంటే మూడు లక్షలు ఇస్తామని ప్రకటించారు కానీ అది ఏమాత్రం సరిపోదన్నారు. రైతు రుణమాఫీకి ఈ రకంగా కేటాయింపులు చేస్తే వడ్డీలకే సరిపోవన్నారు. మన ఊరు మన బడి కేటాయింపుల్లో ఉన్న ఇంట్రెస్టు ఖర్చులు కూడా ఉండాలని, జిల్లా కేంద్ర మెడికల్ కాలేజీకి, ఎంజీ యూనివర్సిటీ పూర్తి చేయుటకు తగిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య ప్రస్తావనే లేదన్నారు. దళిత బంధుకు కేటాయించిన నిధులు ఊరుకో కోడి ఇంటికో ఇక అన్న చందంగా ఉందన్నారు. వివిధ సందర్భాలలో నల్లగొండ జిల్లా ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా చేసిన వాగ్దానాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బడ్జెట్టు సైజుతో పాటు ఖర్చు కూడా అదే స్థాయిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీర్లపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు డాక్టర్ గౌతమ్ రెడ్డి, రవి నాయక్, రాగి రెడ్డి, మంగా రెడ్డి, వినోద్ నాయక్, తిరుపతి రామ్మూర్తి, శశిధర్ రెడ్డి, పరుశరాములు, కుందూరు రమేష్ పాల్గొన్నారు.