Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-వలిగొండ
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అప్పుల కుప్పగా ఉన్నదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు. మంగళవారం ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య అధ్యక్షతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో కేటాయింపులన్నీ అప్పులే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. బడ్జెట్ సవరణ చేసి అన్ని రంగాలకు సమ న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 2లక్షల 56 కోట్ల కేటాయించినప్పటికీ సంక్షేమ పథకాల విషయంలో తగిన నిధులు కేటాయించలేదన్నారు. వ్యవసాయం దళిత బంధు వీటిపై ఎక్కువ ప్రచారం చేసుకుంటునప్పటికీ నిధులు సరైన రీతిలో లేవన్నారు. ఆదాయ వనరులు చూపించకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టడం ప్రజలను మోసం చేయడమే అన్నారు .అంత బడ్జెట్ ఎక్కడ నుండి కేటాయించేది స్పష్టత లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పన్నుల వాటా తగిన విధంగా వసూలు చేసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, మండల కార్యదర్శి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశం నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి, తుర్కపల్లి సురేందర,్ పి జి రెడ్డి రామ్ చందర్, గోపాల్ శ్రీనివాస్, వాకిటి వెంకటరెడ్డి ,సురేష్ ,కొండే కిష్టయ్య ,ఏలే కష్ణ ,దుబ్బ లింగం, యాదయ్య ,ముత్యాలు, గాజుల అంజనేయులు. తదితరులు పాల్గొన్నారు.
గూడూరు బుచ్చిరెడ్డి మృతిపట్ల సంతాపం
వలిగొండ మండలం వర్కట్ పల్లి గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) డివిజన్ కమిటీ మాజీ సభ్యులు గూడూరు బుచ్చిరెడ్డి మంగళవారం సాయంత్రం మృతిచెందారు. ఆయన భౌతికకాయనికి ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి ఎండి,జహంగీర్ ,రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా సందర్శించి నివాళులర్పించారు. సంతాపం ప్రకటించిన వారిలో మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,జిల్లా కమిటటీసభ్యులు ఎండి,పాషా,గంగాదేవి సైదులు వలిగొండ మండల కార్యదర్శివర్గ సభ్యులు కల్కురి రామచందర్, మండల కమిటీ సభ్యులు బీమనబోయిన జంగయ్య,శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి,నాయకులు చేగురి నర్సింహా,మాడుగుల వెంకటేశం,గూడూరు చిన్న బుచ్చిరెడ్డి, పన్నాల పాండు రెడ్డి, గోగు కిష్టయ్య,రొండి రాములు,మల్లేష్,కేసాని సత్తయ్య,తదితరులు ఉన్నారు.