Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్, బీజేపీ కోర్టులకెళ్లి ఉద్యోగాల భర్తీపై మోకాలడొద్దు
- టీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు రామకష్ణారెడ్డి
నవతెలంగాణ-మోత్కూరు
కాళేశ్వరంతో నీళ్లు, గ్రామాలు, మున్సిపాలిటీలు, పట్టణాల అభివద్ధికి నిధులు, నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీతో నియామకాల కల సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని టీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకష్ణారెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని సింగిల్విండోకార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా వయో పరిమితి పెంచి ఇంత పెద్ద ఎత్తున చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 90 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలు, నిరుద్యోగ యువత గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. యాదాద్రి జిల్లాలో 1010 పోస్టులను గుర్తించి భర్తీ చేసుకోవడం జిల్లా అభివద్ధికి శుభపరిణామమన్నారు. ఉద్యోగ భద్రత కోసం ఎదురు చూస్తున్న 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. గతంలో ఉద్యోగాల భర్తీపై అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేశాయన్నారు. నిరుద్యోగుల కలలపై నీళ్లు చల్లోద్దన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని, ఆ రాష్ట్రాల్లో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని, కేంద్రప్రభుత్వం కూడా 9 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మోత్కూరు,అడ్డగూడూరు మండలాల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్ష, ప్రధానకార్యదర్శి బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, గజ్జి మల్లేష్, మార్కెట్ మాజీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేందర్ నాథ్, మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను, జిల్లా కో ఆప్షన్ మెంబర్ గుండిగ జోసెఫ్, మైనార్టీ మండల నాయకుడు ఎండి.మజీద్ పాల్గొన్నారు.