Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బొంతల చంద్రారెడ్డి
నవతెలంగాణ -వలిగొండ
భూస్వామ్య కుటుంబంలో జన్మించి కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా ప్రజల కోసం నిజాయితీగా పనిచేసిన కామ్రేడ్ బుచ్చిరెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బొంతల చంద్రారెడ్డి అన్నారు. బుధవారం వర్కట్పల్లిలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వలిగొండ మండలం లో వర్క్ పల్లి ,సంగం, గోకారం, చౌటుప్పల్ మండలం, రామన్నపేట , తదితర గ్రామాలలోకందాల రంగారెడ్డి నాయకత్వంలో వివిధ ప్రజా ఉద్యమాలను చురుకుగా పాల్గొని పని చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేక అశోక్ రెడ్డి, మద్దెల రాజయ్య, జిల్లెల పెంటయ్య, గూడూరు అంజి రెడ్డి ,నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి, ఫైళ్ళ లింగారెడ్డి ,మండల కార్యదర్శి స్వామి, తుర్కపల్లి సురేందర్ ,తదితరులు పాల్గొన్నారు