Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
సైకో యువకుడు ప్రేమ పేరుతో వేధించడంతో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని శేషమ్మగూడెంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ గోపాల రావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శేషమ్మ గూడెం గ్రామానికి చెందిన దొరేపల్లి భిక్షమయ్య కూతురు దొరేపల్లి ప్రత్యూష (18) నల్లగొండ పట్టణంలోని సప్తపది జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఒంగూరి అనిల్ ప్రత్యూషను ప్రేమ పేరుతో వేధించాడు. ఇంటిలోకి వెళ్లి అరాచకం సష్టించడంతో ఈ మనస్తాపం చెందిన ప్రత్యూష బుధవారం సాయంత్రం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో చీరతో రేకుల ఇనుపకడ్డీ ఉరేసుకుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన నాయనమ్మ చూసి ఈ చుట్టుపక్కల ప్రజలను కేకలు వేసి పిలిచింది. ఉరితీసి ప్రత్యూషను వెంటనే దింపి హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.