Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్ల తర్వాత డిపిఎల్ఎస్ క్యాంప్
నవతెలంగాణ- రామన్నపేట
కరోనా వైరస్ విజంభిస్తున్న తొలినాళ్ళలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను నిలిపివేశారు వైద్యులు. రెండు సంవత్సరాల అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొట్టమొదటి డి పి ఎల్ ఎస్ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల క్యాంపును బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు నిర్వహించారు. 78 మంది అర్హులైన మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు డాక్టర్ జోయల్ నిర్వహించినట్లు జిల్లా కుటుంబ నియంత్రణ అధికారి డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఈ క్యాంపులో రామన్నపేట, వలిగొండ మండలమునకు సంబంధిన పి హెచ్ సి వేములకొండ పరిధిలో అర్హులై మహిళలకు కుటుంబ నియాత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకున్నట్లు అని తెలిపారు. వైద్యాధికారులు డా. సుమన్, డా. పవన్, డా. జ్యోతి, డా. శ్రీశైలం, సిబ్బంది పాల్గొన్నారు.
ఇబ్బందిపడ్డ బంధువులు..
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవడం కోసం మహిళలు వారి బంధువులు ఉదయం 7 గంటలకే రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. ఆసుపత్రి రోగుల రాకతో కిక్కిరిసిపోయింది. మరోవైపు ఎండలు మండిపోతుండడంతో శస్త్ర చికిత్సలు చేయించుకున్న మహిళలు వెంట వచ్చిన వారి బంధువులు, తల్లిదండ్రులు నిలువ నీడ లేక ఇబ్బంది పడక తప్పలేదు. మంచినీటి సౌకర్యం సైతం అంతంతమాత్రంగానే ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఆస్పత్రి ఆవరణలో కూర్చుని భోజనాలు చేస్తూ కనిపించారు.