Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ అసెంబ్లీలో దాదాపు లక్ష ఉద్యోగాల ప్రకటన చేయడంతో చండూర్ మండలంలో సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు చమలపల్లి సర్పంచ్ ముడిగె ఎర్రన్న యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో టపకాయలు కాల్చి ,సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఉద్యోగాలను చూసి నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఇన్ని నోటిఫికేషన్లు గత ప్రభుత్వాలలో ఎన్నడూ కూడా చూడలేదన్నారు. త్వరలో కూడా నిరుద్యోగ భతి ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోడి వెంకన్న, వడ్డేపల్లి గౌడ్, బొబ్బిలి శ్రీనివాస్ రెడ్డి, చిలుకూరి రాధిక శ్రీనివాస్, కోటి, బొడ్డు సతీష్, కొంపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.