Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నకిరేకల్:ఉద్యోగాల భర్తీ తో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని బీసీ కార్పొరేషన్ చైర్మెన్ పూజార్ల శం భయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక మెయిన్ సెంటర్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటన పై హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్ వై ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ సెంటర్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టిపల్లి వీరు, చౌవుగోని శ్రీను, యాసారపు వెంకన్న, కొండ వెంకన్న, ఉగ్గిడి శ్రీనివాస్, చిట్యాల ఆశోక్, గాదగోని కొండయ్య, వంటేపాక శ్రీకాంత్, చిట్టితల్లి బాస్కర్, కొమ్మనబోయిన సైదులు, మాల్లె పవన్ రెడ్డి, సాయి రెడ్డి పాల్గొన్నారు.