Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మునుగోడు
మునుగోడు గ్రామపంచాయతీ పరిధిలో పందుల స్వైర విహారం చేస్తుండడంతో అనారోగ్య బారిన పడతామని గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ దష్టికి తీసుకురాగా స్పందించిన వెంటనే బుధవారంం పందుల పెంపకం దారులకు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జనం నివసించే ప్రాంతాలలో పందుల పెంపకం చేపట్టడం ద్వారా ప్రజలు అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉందని గతంలో పలుమార్లు పందుల పెంపకం దారులకు నోటీసులు జారీ చేసినప్పటికీ పందుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పందులను రెండు రోజులలో పందుల తొలగించాలని లేనిపక్షంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తొలగిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట గ్రామ పంచాయతీ సిబ్బంది దత్తు, సాయి కిషోర్ సుధాకర్ బుకేష్ ఉన్నారు .