Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
ఉద్యోగ నియామకాలకు బుధవారం నుంచే నోటిఫికేషన్లు వేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలో మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం వర్గీయులు మాజీ మార్కెట్ చైర్మెన్ కాటన్ వెంకటేశం , విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆర్డినేటర్ అద్దెల లింగారెడ్డి , బట్టు ఐలెష్, కొండ కింది వెంకట్ రెడ్డి, దేశ పాక రాజేష్, తెలుసురి సైదులు, తాడూరి చంద్రం, కోసనం అశోక్, సందీప్, నూతి సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే లింగయ్య వర్గీయులు సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామకాల ప్రకటన చేసిన సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ యూత్, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బాంబులు కాల్చి, స్వీట్లు పంచారు.ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ చిత్రగంటి ప్రవీణ్ యూత్ నాయకులు జనగం అర్జున్ , యసీన్, శ్రీకాంత్,సాయి,నవీన్ ,జానీ,దుర్గేష్,వినరు, కుమార్,వినరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.