Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- భువనగిరి రూరల్
భువనగిరి మండల పరిధిలో హనుమాపురం శివారులో గల స్థానిక బచ్ పన్ ఆకాడమీక్ హైట్స్‌లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త అంజలి గుప్తా మాట్లాడుతూ మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివద్ధి చెందదన్నారు. ప్రెసిడెన్సీ విద్యాసంస్థల చైర్మెన్ తీగల జయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఎక్కడైతే పూజింప బడతారో అప్పుడే మహిళకు స్వలంబన శక్తి సామర్ధ్యలు వస్తాయన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటి అనాధశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అండాలు డాక్టర్ జయశ్రీ, అకాడమీక్ డైరెక్టర్ మైపాల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ మెట్లకు సన్మానం
మండలం లోని యర్రంబెల్లి గ్రామంలో సర్పంచ్ గాదె యశోదా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాధి హామీ మెట్లను, కూలీలను పని ప్రదేశంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అభివద్ధి అధికారి గుత్తా నరేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి అనురాధ , ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి బాలస్వామి, టెక్నీకల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు.