Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిడ్జి స్కూల్ నిత్యావసర సరుకులు పక్కదారి
- విద్యార్థులు పొట్టగొడుతున్న కాంట్రాక్ట్ వంట మనుషులు
నవతెలంగాణ -నల్లగొండ
కంచె చేను మేసిన చందంగా హాస్టల్ విద్యార్థులకు వండి వడ్డించాల్సిన వంట మనుషులే పేద విద్యార్థుల పొట్టలు కొడుతున్నారు.దీంతో ఆ హాస్టల్ విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఉపాధ్యాయులు సరుకులు ఇస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ వంట మనుషులు అందిందె తడువుగా ఆ వస్తువులను పక్కదారి పట్టిస్తు సొమ్ము చేసుకుంటున్నారు .ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రం నడిబొడ్డున బోయ వాడల్లో గల రెసిడెన్షియల్ బ్రిడ్జి స్కూల్ బీసీ బాలురలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థులకు ఆదివారం మెనూ ప్రకారం మాంసాహారం పెట్టాల్సి ఉండగా వచ్చిన చికెన్ ను వంట మనుషులు పూర్తిగా విద్యార్ధులకు వండి పెట్టకుండా పిల్లలకు తెచ్చిన మాంసాహారాన్ని వారి సొంత వినియోగానికి అందులోకి సుమారుగా సగభాగం వంట శాల వెనుకభాగము నుంచి తరలిస్తుండగా స్కూలు పరిసర ప్రాంత ప్రజలు గమనించి పట్టుకుని ఆ పాఠశాల సిబ్బందికి, ఎస్ఓ కు సమాచారం అందించారు.వారి సమాచారం మేరకు సిబ్బంది వంట మనుషులను విచారించారు. ఈ విచారణలో మాంసాహారం తో పాటు పాఠశాలలో అందించే నిత్యావసర సరుకులు నూనె, పప్పు ,ఉప్పు, కారం, పసుపు ,తదితర వస్తువులను స్కూల్ పక్క ఇంట్లో ఒక బస్తా నిండా నిల్వ ఉంచారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు.సమాచారం మేరకు అధికారులు స్థానిక కౌన్సిలర్ అబ్బగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి పక్కదారి పట్టించిన నిత్యావసర సరుకుల బస్తాను సీజ్ చేశారు.
సరైన భోజనం అందించాలి..గణేష్ .7వతరగతి
ఈ పాఠశాలలో ఇప్పటికైనా సరైన భోజనం అందించెల అధికారులు చర్యలు తీసుకోవాలి. మెనూ ప్రకారం ప్రతి రోజూ భోజనం కోసం నిత్యావసర సరుకులు అందిస్తే మాకు అందించాల్సిన ఆహారం వంట మనుషులు సగభాగం పక్కదారి పట్టించడంతో అందాల్సిన ఆహారం అందక పోవడంతో ఆకలితో అలమటిస్తున్నా మని తెలిపారు.
నిత్యావసర సరుకులు పక్కదారి పట్టింది వాస్తవమే.. అహ్మద్ ఉద్దీన్. రెసిడెన్షియల్ బ్రిడ్జి స్కూల్. ఎస్వొ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సరుకులు అందిస్తే వంట మనుషులు కొంత భాగాన్ని పక్కదారి పట్టించిన విషయం వాస్తవమేనన్నారు. ఇప్పటి నుండి అలా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పాఠశాలలో సీసీ కెమెరాలు లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని వెంటనే జిల్లా అధికారులు పాఠశాల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.