Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్పల్లి
రాష్ట్రంలో నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా 91, 142ఉద్యోగ నియామకాల ప్రకటన చేసిన సందర్భంగా బుధవారం మండల కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నాయకత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ శ్రేణులు పాలభిశేకం చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నార్కట్పల్లి మాజీ సర్పంచ్ పుల్లెంల అచ్చాలు, నాయకులు గాయం శ్యామ్ సుందర్ రెడ్డి, గడ్డం పశుపతి, వేముల నర్సింహ, నాంపల్లి శ్రీను, ముంత వెంకన్న, కొరివి శివరాం, బోడ శంకర్, పన్నాల క్రిష్ణరెడ్డి, జిల్లా పధ్వీ, ఉయ్యల శ్రవణ్, మేడబోయిన ఐలయ్య, శివ, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.