Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించడం పట్ల టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు సి జగన్ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడం తో పాటుగా, ఎంతో కాలంగా సిబ్బంది కొరతతో పని భారంతో బాధపడుతున్న ఉద్యోగులకు కూడా ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.
భువనగిరి రూరల్ : భువనగిరి మండలం లోని బస్వాపురం పరిధిలోగల బస్వాపూర్ రిజర్వాయర్ పై సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ కి గొర్రెల మేకల అభివద్ధి ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నియామకాలపై ప్రకటన చేసినందుకు పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీపి నరాల నిర్మల వెంకట స్వామి యాదవ్, తుక్క పురం ఎంపిటిసి రాసాల మల్లేష్ యాదవ్, నాయకులు వెంకట స్వామి యాదవ్, బసాపురం గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
రాజాపేట: ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద టీిఆర్‌ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా నిరుద్యోగ యువతులు కూడా పూలాభిషేకం చేశారు . ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజి రెడ్డి, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, ఎంపీపీ గోపగోని బలమని యాదగిరి గౌడ్, కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, మండల సెక్రెటరీ జనరల్ భాస్కర్ గౌడ్, పల్లె సంతోష్ గౌడ్, ఎస్సీసెల్ జిల్లా నాయకులు మోత్కుపల్లి ప్రవీణ్, వెంకటేశ్వర్ రెడ్డి, రేగు సిద్ధులు, తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్: అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ ప్రకటన చేయడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ బుధవారం టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని జాతీయ రహదారిపై కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మార్కెట్ ఛైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి, గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్, తొర్పునూరి నర్సింహాగౌడ్, కానుగు బాలరాజు, కోరగోని లింగస్వామి, కానుగు శేఖర్, కానుగుల వెంకటయ్య పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీ వాగ్దానం అమలుకుి శ్రీకారం చుట్టారని మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య ,టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్ పట్టణ కమిటీ,విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల డైరెక్టర్ ఆడెపు బాలస్వామి ,వార్డు కౌన్సిలర్లు భేతి రాములు, జూకంటి శ్రీకాంత్ , నాయకులు మొరిగాడి వెంకటేష్, కోటగిరి ఆంజనేయులు , బేదరకోట దుర్గేష్ ,ఆలేటి అనీల్, పూల శ్రావణ్, అయిలి కష్ణ ,జింకల భరత్ మెహమూద్ ,పట్టణ మణిక్యాల ఈశ్వర్ బల్లెపు సంపత్,సుధీర్,బైరి మహేందర్,కనకరాజు రాజశేఖర్, సాయి.మహేష్,నవీన్,శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : నిరుద్యోగుల కోసం 91394 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ప్రకటనను ముఖ్యమంత్రి కేసీఆర్ చేయడంతో బుధవారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణాసంచా కాలుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోచ బోయిన మల్లేశం, ఎంపీపీ కే జ్యోతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి, ముత్యాల సుజాత, ఎం పి టి సి గాదె పారిజాత, మండల కో ఆప్షన్ సభ్యులు ఆమెర్, తదితరులు ఉన్నారు.
మోటకొండుర్ : మండల కేంద్రంలోటీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద గ్రామ శాఖ ,యూత్ ఆధ్వర్యంలో కేసీిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో పాల సంఘం చైర్మెన్ కొల్లూరు మల్లేష్ మిత్ర, మార్కెట్ డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, మండల బీసీ సంఘం అధ్యక్షులు మల్గ గౌరయ్య, టౌన్ ప్రధాన కార్యదర్శి బొలగని మోహన్ గౌడ్, బొట్ల పాండు ,టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ గంధమల్ల మధు, తదితరులు పాల్గొన్నారు.
గుండాల: నిరుద్యోగులకు 91,142 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని హర్షిస్తూ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ ఖలీల్,వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి,రైతు విభాగం నాయకులు మచ్చ చెన్నా రెడ్డి,కోలుకొండ రాములు,రంగారెడ్డి, శ్రీనివాస్ ,సోషల్ మీడియా మండల కన్వీనర్ బొమ్మిడి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు:తెలంగాణ నిరుద్యోగ యువత కలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు కంచర్ల క్రాంతికుమార్ రెడ్డి, కౌన్సిలర్ పురుగుల వెంకన్న, గ్రంథాలయ కమిటీ చైర్మన్ కోమటిమత్స్యగిరి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెడిపెల్లి రఘుపతి, నాయకులు ఎండి.మజీద్, కూరెల్ల పరమేష్ దాసరి తిరుమలేష్, అవిశెట్టి స్వామి, దాసరి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : మండలంలోని కొలనుపాక గ్రామంలో బస్టాండ్ సమీపంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ బుధవారం పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని హర్షిస్తూ పాలాభిషేకం చేశామన్నారు అనంతరం బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ..ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు జంగా స్వామి, మాజీ ఎంపిటిసి మామిడాల ఆంజనేయులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిడాల నరసింహులు, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు మామిడాల భానుచందర్ ,యూత్ గ్రామ శాఖ అధ్యక్షుడు మడి పల్లి సురేష్ ,మాజీ ఎంపిటిసి బొంకూరి భాగ్యలక్ష్మి, మిట్టపల్లి పాండు, సోములు, సంపత్ ,కొండల్, సోమిరెడ్డి ,రమేష్ ,స్వామి ,రాజు తదితరులు పాల్గొన్నారు.