Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ను ఆహ్వానించరా?
- సీఎం మూర్ఖత్వానికి ఇది పరాకాష్ట
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ -నల్లగొండ
బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ను ఆహ్వానించ కపోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖత్వమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు . అసెంబ్లీలో గవర్నర్ సొంత ప్రసం గం ఉండదని.. కేబినెట్ ఆమోదించిన స్పీచ్ నే అసెంబ్లీలో చదివి వినిపిస్తారని గుర్తు చేశారు. బహుశా కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అభివద్ధి ఏమీ లేనట్టుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మూడు రోజులు మహిళ బంధు పేరుతో ఉత్సవాలు నిర్వహించి చివరికి రాష్ట్ర ప్రథమ పౌరురాలు రాజ్యాంగాన్ని కాపాడే గవర్నర్ పదవిని కించపరచడం ఎంత వరకు సమంజసమన్నారు. సీఎంను గవర్నర్ ఎన్నడూ అవమానించలేదని ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేయలేదని ఇదే సీఎం గతంలో తమిళిసైని పొగిడారని గుర్తు చేశారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించలేదో కేసీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు మహిళలంటే చులకన భావన అని మొదటి నుండి కించపరచడం ఆయనకు అలవాటేనన్నారు. గవర్నర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే కేసీఆర్కు కులగజ్జి పుట్టుకుందని విమర్శించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్ ,నకిరేకంటి కాశయ్య గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ,బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గండి చెరువు వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.