Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
పట్టణంలోని నాగార్జున డిగ్రీ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణ కంచి వస్త్రాలయంని బుధవారం స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి రమాదేవి, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి,ఆయన సతీమణి, స్థానిక కౌన్సిలర్ కవిత దయాకర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ నల్లగొండ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యతాపరమైన వస్త్రాలు యాజమాన్యం అందుబాటులో ఏర్పాటుచేసి ప్రారంభించడం ఎంతో అభినందనీయమని అన్నారు . షాపింగ్ మాల్ యాజమాన్యం విఫుల్ గోయల్ ఆషీస్ గోయల్ మాట్లాడుతూ 2013లో హైదరాబాదులోని కొత్తపేటలో బ్రాంచ్ ప్రారంభించామన్నారు.వినియెగ దారుల ఆకర్షణ పెరగడంతో నల్లగొండ పట్టణంలో రెండవ బ్రాంచ్ ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పిల్లి రామారాజ్ యాదవ్, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్, పూజిత శ్రీనివాస్, బిల్డింగ్ యజమాన్యం, హీరో షోరూం యజమాని గట్టు వెంకన్న, గట్టు ప్రసాద్, రావుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం యాజమాన్యం అతిథులను సన్మానించారు.