Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ఆదిరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
విద్యార్థినీలు మారుతున్న చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ఆదిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని రామగిరి ప్రభుత్వ డిగ్రీ బాలికల కాలేజీలో జరిగిన ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, గ్రంథాలయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఉమెన్ ఎంపవర్మెంట్, సైబర్ క్రైమ్స్ రోడ్డు సేఫ్టీ అనే అంశాలపై కళాశాల విద్యార్థి నులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చట్టాలలో వస్తున్న అనేక మార్పులపై అవగాహన పెంపొం దించుకోవడం ద్వారా సైబర్ నేరాల వలలో పడ కుండా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్య మాల వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రస్తుత సమాజంలో నేరాలు సైతం వివిధ రూపాలలో మార్పు చెందుతున్నాయని, ప్రధానంగా ఆడ పిల్లలపై పెరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఇదే సమయంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలలో, ట్రాప్‌లలో పడి భాగస్వామ్యం అయ్యి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరారు. ముఖ్యంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే ఎంచుకోవాల్సిన మార్గాలను, మెలకువలను సమగ్రంగా వివరించారు. సందర్భంగా కళాశాల సిబ్బంది సీఐ ఆదిరెడ్డిని ఘనంగా సన్మానించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘనశ్యామ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ కె.చంద్రశేఖర్, కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ దేవవాణి, కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఇన్చార్జ్ అమల గ్రంథాలయ శాస్త్ర అధ్యాప కుడు సుంకరి రాజారామ్, కళాశాల ఐక్యూసి కో ఆర్డినేటర్ రాజశేఖర్, అధ్యాపకులు స్వామి, శ్రీధర్, యాదగిరి, అపర్ణ చతుర్వేది, సరిత, వనజ తదిత రులు పాల్గొన్నారు.