Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
నూతన పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపడుతామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కూరగాయల, మటన్ వ్యాపారస్తులు, అధికారులు, ప్రజా ప్రతిని ధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రస్తుతం వారు వ్యాపారం నిర్వహిస్తున్న స్థలాన్ని ఖాళీ చేసి వెనుకవైపున ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మున్సిపాలిటీల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రెండు మూడు నెలల్లో ఉదయ సముద్రం పూర్తిచేసి వ్యవసాయానికి సాగు నీరు అందుతుందన్నారు. పిలాయిపెల్లి భూసే కరణకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేయా లని ఆర్థిక మంత్రి హరీష్ రావుకు , ముఖ్యమంత్రి కెేసీిఆర్ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ జడల ఆది మల్లయ్య, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ సిబ్బంది, పట్టణ అధ్యక్షుడు లక్ష్మయ్య, నాయకులు పాల్గొన్నారు.
సీసీి రోడ్ల పనులకు శంకుస్థాపన
చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో రూ.85 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తిలింగయ్య శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుంకరి ధనమ్మ యాదగిరి గౌడ్, ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీ సత్తయ్య, సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
చౌటబావిలో ఎమ్మెల్యే చిరుమర్తి పర్యటన.