Authorization
Sat March 22, 2025 06:46:24 am
- అసెంబ్లీలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
నవతెలంగాణ-దేవరకొండ
మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం అద్భుతమైనదని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ 2019 ప్రకారం కాకుండా ప్రస్తుతం ఉన్నవిద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకంలో పాఠశాలలను తీసుకోవాలని సూచిం చారు. జిల్లా పరిషత్ పాఠశాలలతో పాటు, అప్పర్ ప్రైమర్ పాఠశాలలకు డైనింగ్ హాలు మంజూరు చేయాలన్నారు. మధ్యాహ్నం భోజనం బకాయిలు విడుదల చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్, స్వీపర్ పోస్టులు మంజూరు చేయాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకంలో తీసుకొని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. కొండమల్లేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బైఫర్ కేషన్ చేయాలన్నారు.