Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయీంబర్స్ మెంట్ విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ మండలకమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సూరజ్‌కుమార్‌కు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయీంబర్స్ మెంట్ విడుదల కాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని తెలిపారు. తక్షణమే ఫీజు రీయీంబర్స్ మెంట్, స్కాలర్షిప్పులు విడుదలచేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు తీగుళ్ల శ్రీనివాస్, దాసరి ప్రకాశ్, సాతిరి మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.