Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ
నవతెలంగాణ -ఆలేరురూరల్ .
మూడెకరాల సాగు భూముల పంపిణీకి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మంగళం పాడారని వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ విమర్శించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటి స్థలం ఉన్న వారికి రూపాయలు 5 లక్షల 50 వేలు ఇస్తామని గత ఎన్నికల్లో వాగ్దానం చేసి మూడు లక్షలు ఇస్తా అనడం మోసపూరితమన్నారు. రాష్ట్రంలో ఇండ్ల్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్న లక్షల మంది ఉన్నారని కానీ ప్రభుత్వం ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే మూడు లక్షలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం దారుణమన్నారు. ఇంటి స్థలం లేని ప్రజల గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. ఉపాధి హామీ పనులకు బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించలేదన్నారు.ఈ నెల 15న వలిగొండ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లా విస్తతస్థాయి సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు జూకంటి పౌలు, జిల్లా కమిటీ సభ్యురాలు లక్ష్మి ,మండల నాయకులు సిరిగిరి సారయ్య, అందే అంజయ్య, శంకరయ్య ,లక్ష్మి, ప్రతాపరెడ్డి ,రాజు, విజరు తదితరులు పాల్గొన్నారు.