Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ-నల్లగొండ
పదవితో పాటు బాధ్యతలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు.గత కొన్ని సంవత్సరాల నుండి పీసీ టు హెచ్సీ ప్రమోషన్స్ కోర్టు వివాదంలో పెండింగ్ లో ఉండి ఎట్టకేలకు డీజీపీ ప్రత్యేకమైన చొరవ తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో పీసీ నుండి హెచ్సీలుగా ప్రమోషన్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా మన ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి 195 మంది మన జిల్లా నుండి 102 మంది సిబ్బందికి కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన సిబ్బందిని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవితో పాటు బాధ్యతలు పెరుగుతాయని, బాధ్యతతో పని చేసి ప్రజలతో మమేకం అవుతూ వారి మన్ననలు పొందాలని, కింది స్థాయి సిబ్బంది నుండే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందని, దానిని పెంపొందే దిశగా పనిచేసి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ మంజు భార్గవి, బి. సూపర్డెంట్ సరితా రాణి, జిల్లా పోలీసు అధి కారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, సెక్రటరీ సోమయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు.
పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేత
గత సంవత్సరం కేతపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ కాన్సర్తో బాధపడుతూ మృతి చెందిన ఏఎస్ఐ వెంకన్న కుటుంబ సభ్యులకు మూడు లక్షల ఇరవై వేల రూపాయల భద్రత చెక్కును ఎస్పీ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని చెప్పారు. చనిపోయిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ మంజు భార్గవి , పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య పాల్గొన్నారు.