Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా మాశెట్టి అనంతరాములు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఆర్యవైశ్యుల అభివద్ధికి కషి చేస్తాన ని ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మాశెట్టి అనంతరాములు తెలిపారు.శుక్రవారం జిల్లాకేంద్రంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్యసంఘం జిల్లా ఎన్నికలు నిర్వహించారు.ఈ సందర్భంగా హుజూర్నగర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకులు మాశెట్టి అనంతరాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.ఆర్యవైశ్యుల ఉన్న పేదలను గుర్తించి వారికి ఆర్థిక సహకారం అందిస్తా నన్నారు.జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ఆర్యవైశ్య సంఘ భవన నిర్మాణం కొరకు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు సుమారు రూ.30 లక్షలు విరాళంగా ఇస్తామని వాగ్దానం చేశారు.ఎన్నికల నిర్వాహకులుగా ఊర లక్ష్మణ్ ఇరుకుల రామకష్ణలు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ప్రస్తుత ఆ సంఘం అధ్యక్షులు కర్నాటికిషన్, ప్రధానకార్యదర్శి గరినే శ్రీధర్, కోశాధికారి బొమిడి లక్ష్మీనారాయణతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు గుండా రమేష్ బాబు, బచ్చు రామారావు, సింగరికొండ శ్రీనివాస్, మట్టపల్లి వెంకటనారాయణ, ఓరుగంటి నర్సింహారావు, పొలిశెట్టి నర్సింహారావు, విద్యాసాగర్, రవికుమార్, భాస్కర్, పాపారావు చల్లా రామ్మూర్తి, మధు, వెంకటేశ్వర్లు, మొరిశెట్టి శ్రీనివాసు,మంచాల రంగయ్య మీలా మహదేవ్, కోటగిరి రాధాకష్ణ,తోట శ్యాంప్రసాద్, రాచర్ల కమలాకర్, బండారు రాజా, దేవరశెట్టి సత్యనారాయణ, సింగరికొండ రవీందర్, గుండా శ్రీదేవి, మీలా వంశీ,గోపారపు రాజు, బచ్చు పురుషోత్తం పాల్గొన్నారు.