Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
వంశంలో చదువుకున్న విద్యావంతుడనుకుని భూములను సమభాగాలుగా పంపకం కల్పించాలని కోరగా ఆ భూమిని స్వార్థంతో ఆక్రమించుకోని పట్టా చేసుకున్నారని ఆరోపిస్తూ మండలంలోని కుడకుడ కు చెందిన పిండిగ వంశస్థులు శుక్రవారం కుడకుడ కలెక్టరేట్ వద్ద టెంట్లు వేసి ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము తమ తండ్రికి ఆరుగురు వారసులమన్నారు.కాగా తమకు వ్యవసాయానికి సహకరించేందుకు విశ్వ బ్రాహ్మణులు ఒకరికి కలుపుకొని మొత్తం ఏడు భాగాలు ఉన్నామని తెలిపారు.తమకు కుడకుడ గ్రామశివారు వేర్వేరు 18 సర్వే నెంబర్లలో 115.27 ఎకరాలభూమి ఉందన్నారు.దానిని ఏడు భాగాలుగా విభజించగా ఒక్కొక్కరికి 15.09 ఎకరాల భూమి రావాల్సి ఉందన్నారు.దీంతో తమ వంశంలో చదువుకున్న పిండిగ కరుణాసాగర్ (డీఈపంచాయతీరాజ్) నకిరేకల్‌లో పనిచేస్తున్న) మా అందరి వద్ద భూమి తీసుకుని తన భార్య ఏడిండ్ల పుష్పలత తహసీల్దార్ కావడంతో) అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపించారు.పొత్తుల భూమిని సమాన భాగాలు చేయకుండా వేరే వారికి భూమి అమ్మి తమకు అన్యాయం చేశారని ఆరోపించారు.ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి పిండిగా కరుణాసాగర్ ఏడిండ్ల పుష్పలత లు అక్రమంగా చేయించుకున్న భూమిని పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దుచేసి భాగస్తులందరికీ సమానంగా పంపకం చేపట్టాలని డిమాండ్ చేశారు.కరుణాసాగర్ భార్య తహశీల్దారు కావడంతో గ్రామంలో పాలివారి దగ్గర భూమి కొనుగోలు చేసినట్టు నకిలీ పత్రాలు సష్టించి అక్రమంగా తన పేర పట్టా చేయించుకున్నాడని ఆరోపించారు.అయినప్పటికీ తాము ప్రతి వ్యక్తి(ఒక భాగం) రెండు గుంటల చొప్పున కరుణాసాగర్‌కు దానం చేశామని, దానిని సాకుగా పెట్టుకుని మా భూమిని పట్టా చేయించు కున్నాడని ఆరోపించారు.ఈ విషయమై మంత్రి జగదీశ్‌రెడ్డికి,నకిరేకల్ ఎమ్మెల్యే లింగ య్యకు,కలెక్టర్ వినరుకృష్ణారెడ్డికి, ఆర్డీఓకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.ఈ కార్య క్రమంలో పిండిగ వంశస్థులు పిండిగ ఫౌల్, పిండిగ రవి, పిండిగ కళామని, పిండిగ అశోక్, పిండిగమణి, పిండిగ ఏలియా, పిండిగ జార్జి, పిండిగ నర్సయ్య, పిండిగ సుగుణ, పిండిగ ప్రకాశం, వారి కూతుళ్లు, కుమారులు పాల్గొన్నారు.