Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ :జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు వర్తింప చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, మహిళా కార్మికుల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. పని లేని సమయాలలో ప్రజలకు పని కల్పించాలనే లక్ష్యంతో వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా ఏర్పడిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని అన్నారు. పట్టణీకరణ పేరుతో అనేక గ్రామాలను మున్సిపాలిటీగా కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో ఉపాధి హామీ పని రద్దయిందని అన్నారు. దీంతో పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో నిధులు పెంచి పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలని డిమాండ్ చేశారు. రోజు కూలి రూ.600 వచ్చే విధంగా సంవత్సరానికి 200 రోజులు పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన వెంకులు, గోలి నరసింహ, కట్ట అంజయ్య, సైదమ్మ, పోలోజు లక్ష్మమ్మ, దాసరి సుగుణమ్మ, ఎల్లమ్మ, వహీదా, నశ్రీనా, రాములమ్మ, మునెమ్మ, జారేఖ, వెంకయ్య పాల్గొన్నారు.