Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు గొబ్బి నర్సయ్య అన్నారు.శుక్రవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టి మాట్లాడారు.సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని, పే స్కేల్ ఇవ్వాలని, 55 ఏండ్లుపైబడిన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వీఆర్ఏలందరికీ వారి సొంత గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని కోరారు.ఈ నిరాహార దీక్ష ఈనెల 15వ వరకు చేపట్టనున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల ఉపాధ్యక్షుడు జానీపాషా, వివిధ గ్రామాల వీఆర్ఏలు బొల్లెద్దు రామకష్ణ, మీసాల పద్మ, మద్దెలమధు, రాయిచంద్రయ్య, గంధమళ్ళ రాములు, దాసరి యాదయ్య, షేక్ జాన్మియా, జంజరాల పిచ్చమ్మ, పగడాలరాణి, చిత్రం ఎల్లమ్మ, జక్కినర్సయ్య,బాలస్వామి పాల్గొన్నారు.